ETV Bharat / state

పుదుచ్చేరిలో ఆ ఓటర్ల వద్దకే బ్యాలెట్ బాక్స్​

author img

By

Published : Mar 29, 2021, 5:15 PM IST

ఓటేయాలంటే.. క్యూలో నిల్చోవాలి. వృద్ధులకు.. వికలాంగులకు.. ఇబ్బందే. ఈ సమస్య రాకుడదని.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల అధికారి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నూటికి నూరు శాతం ఓటింగ్ జరగాలని.. ఓటర్ వద్దకే బ్యాలెట్ బాక్స్​ పంపించారు.

పుదుచ్చేరిలో ఆ ఓటర్ల వద్దకే బ్యాలెట్ బాక్స్​..

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల ఆరో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నూరు శాతం ఓటింగ్ జరగాలని లక్ష్యంతో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా ఓటరు వద్దకే బ్యాలెట్ బాక్స్.. తీసుకెళ్లారు.

80 ఏళ్ల వయసు పైబడిన వారు.. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు తమ ఓటు వారి ఇంటి వద్దే వేసుకునేలా పుదుచ్చేరి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఓటర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మేరకు యానంలో 506 మంది ఇంటివద్దనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం వీరి కోసం ప్రత్యేక బ్యాలెట్ పత్రాన్ని ముద్రించింది. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించింది.

ఎలా ఓటేస్తారంటే..?

ఒక రిటర్నింగ్ అధికారి... ఇద్దరు సహాయ అధికారులు.. పోలీస్ సిబ్బందితో ఐదుగురు ఒక టీంగా ప్రత్యేక వాహనంలో బ్యాలెట్ బాక్స్, ఓటింగ్ కంపార్ట్​మెంట్​తో ముందుగా పేరు నమోదు చేసుకున్న ఓటరు ఇంటి వద్దకు చేరుకుంటారు. ఎవరూ లేకుండా చూసుకొని.. ఆ ఓటరుతో ఓటు వేయిస్తారు. దానికి సీలు వేసి బ్యాలెట్ బాక్స్ లో వేయిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఎన్నికల సిబ్బంది వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. ఓటరు.. తాము ఓటు వినియోగించుకున్నట్టు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి.. సిబ్బందికి ఇస్తారు.

ఇప్పటి వరకు 480 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. యానాం అసెంబ్లీ నియోజవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. ఏ కారణం తో అయినా ఓటు వేయనివారు 6న జరిగే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేదని వెల్లడించారు. ఇంటి వద్దకే బ్యాలెట్ బాక్స్​తో వస్తున్న ఎన్నికల సిబ్బందిని చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఓటు వేసిన వృద్ధులు... దివ్యాంగులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి పోలింగ్ కేంద్రాల వద్ద నిరీక్షించే శ్రమ తప్పిందంటున్నారు.

ఇదీ చదవండి:

తెలుగింటి ఆడపడుచు అరుదైన ఘనత.. రామసేతును ఈదిన రెండో మహిళ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.