తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఏపీఓగా విధులు నిర్వహిస్తున్న డి. దైవ కృపావతి(58) బుధవారం మృతి చెందారు. బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామానికి చెందిన కృపావతి కాకినాడలో కార్పొరేషన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఎన్నికల విధుల నిమిత్తం చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.. అయితే విధులు నిర్వహిస్తున్న కృపావతి రక్తపోటుకు గురై తీవ్ర అస్వస్థత చెందారు. వెంటనే అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యసేవలు అందేలోపే ఆమె మృతి చెందారు.
ఇదీ చదవండి: