తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని గాజుల గుంట గ్రామ పరిధిలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తయారీదారులు రహస్యంగా నిల్వచేసిన నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్.ఐ హరీష్ కుమార్ తెలిపారు. దాదాపు 3 వేల 200 లీటర్ల ఊట ధ్వసం చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి.. నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారుల దాడులు