ETV Bharat / state

బోరులోంచి బయటకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు, వలలు

నిరుపయోగంగా ఉన్న బోరును శుభ్రం చేస్తుండగా అందులోంచి నీటితోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, తదితరాలు బయటకొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా దొడ్డిగుంటలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది.

plastic covers from borewell
బోరులోంచి వస్తున్న రకరకాల వ్యర్థాలు
author img

By

Published : Apr 17, 2021, 12:43 PM IST

బోరులోంచి బయటకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు

మూడేళ్లనుంచి నిరూపయోగంగా ఉన్న బోరును శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా అందులోనుంచి నీటితోపాటు తాగిపడేసిన నాటుసారా ప్యాకెట్లు, వలలు, ప్లాస్టిక్ కవర్లు బయటకొచ్చాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యంలో వైరల్​గా మారింది.

గ్రామంలోని ఒ బోరు నిరూపయోగంగా పడి ఉంది. ఎండాకాలం కావడంతో స్థానికుల నీటి కోరత తీర్చేందుకు ఆ బోరును పంచాయతీ సిబ్బంది బాగు చేయించే ప్రయత్నించారు. మెషీన్​తో బోరును శుభ్రం చేస్తుండగా.. నాటు సారా ప్యాకెట్లు, వలలు, చెత్త కాగితాలు పైకి నీటితో పాటుగా వెదజల్లి పడ్డాయి. స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికుడు వీడియో తీసి సామజిక మాధ్యమంలో పెట్టారు. చాలా రకాల వ్యర్థాలు, నీతోపాటు వచ్చినట్టు ఆర్​డబ్ల్యూఎస్ జేఈ రాంజీ తెలిపారు.

ఇదీ చూడండి:

రేపు విజయవాడలో అన్ని వ్యాపార సంస్థలు మూసివేత

కరోనా పంజా- కొత్తగా 2 లక్షల 34 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.