కొవిడ్ బాధితులకు వైద్య సేవలందించడంలో జగన్ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని తెదేపా నేత , మాజీ మంత్రి పితాని సత్యనారయణ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో విఫలమయ్యాయని చెప్పారు. ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ అండదండలతో రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెరిగిందని ఆరోపించారు.
కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చిన ప్రభుత్వం.. నిధులు మాత్రం విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు. అందువల్లే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: