తీర్ధయాత్రల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను ఒడిశా - ఏపీ సరిహద్దుల్లో చింతూరు పోలీసులు నిలిపివేశారు. గత నెల 14న వీరంతా తీర్ధయాత్రల కోసం వెళ్లి.. లాక్డౌన్ వల్ల ఈనెల 21న బిహార్లో చిక్కుకుపోయారు. వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వడం వల్ల ఏపీ - ఒడిశా సరిహద్దుకు చేరుకున్నారు. అయితే వీరిని అక్కడే అడ్డుకున్న పోలీసులు.. చింతూరు ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. వీరందరికి 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటరమణ తెలిపారు.
ఇదీ చదవండి: