రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంకు చెందిన ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో.. రాజేష్ అనే వ్యక్తికి దెబ్బలు తగిలాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతడిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనం ముందు భాగం ఛిద్రమైంది. మరో వాహనంపై ఇద్దరు ఉన్నారని.. వారికి ఏమీ కాలేదని వివరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త