ETV Bharat / state

అతడి చేతిలో మోసపోయింది.. ఒకరిద్దరు కాదు.. మెుత్తం 30 మంది!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి క్వారంటైన్​ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. ప్రజా ప్రతినిధి నుంచి 2 లక్షలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. తరువాత తెలిసిందేంటంటే ఇలా మోసపోయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారని!

person cheats 30 famous personalities
ప్రముఖులను మోసం చేసిన వ్యక్తి
author img

By

Published : May 21, 2020, 9:30 AM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికే.. ఓ అపరిచిత వ్యక్తి టోకరా వేసి 2 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

రాజమండ్రి క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. అక్కడే ఉంటున్న మరో వ్యక్తి ఫోన్​తో అమలాపురంకు చెందిన ఓ ప్రజా ప్రతినిధికి ఫోన్ చేశాడు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు స్వల్ప మెుత్తంలో నగదు డిపాజిట్ చేస్తే పెద్ద మెుత్తంలో లబ్ధి చేకూరుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. 2 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసేందుకు ప్రజా ప్రతినిధి అంగీకరించారు. ఆ మాయగాడు తెలివిగా మరొకరి బ్యాంకు ఖాతా ఇచ్చి, దాంట్లో నగదును జమ చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన ఖాతాకు ప్రజా ప్రతినిధి గూగుల్ పే ద్వారా ఆన్​లైన్​లో 2 లక్షలు పంపించారు. అనంతరం ఆ మాయగాడి నుంచి ఎటువంటి స్పందన లేక... మోసపోయానని గమనించిన ప్రజా ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతడి నుంచి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఈ మహా మోసగాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా సుమారు 30 మందికి పైగా ప్రముఖులను మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

ఇసుక ర్యాంపులను పరిశీలించిన జేసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.