నిరుపేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాలను అడవికి చేరువలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ... తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. తిరుమలాయపాలెం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇచ్చే ఇళ్ల స్థలాలు నివాసయోగ్యం కాదని మహిళలు ఆందోళనకు దిగారు. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో అడవిలో స్థలాలు ఇస్తే ఎలా ఉంటామని నిలదీశారు.
పాములు, జంతువుల మధ్య తాము బతకలేమని... ఎటువంటి సౌకర్యాలు కూడా లేవని వాపోతున్నారు. అనువైన ప్రాంతంలో స్థలాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండీ...పోలీసులే అన్నదాతలకు న్యాయం చేయాలి: సీపీఐ రామకృష్ణ