లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలను ప్రజలు గమనిస్తున్నారని.. వాటిపై అభ్యంతరం తెలిపిన వారిపైన కేసులు పెడుతున్నారన్నారు.
ఇళ్ల స్థలాల పేరుతో కొబ్బరి తోటలు నరికివేయడం తన దృష్టికి వచ్చిందని జిల్లా నేతలతో చెప్పారు. లాక్ డౌన్ కారణంగా అరటి, పూల వ్యాపారంపై ఆధారపడినవారు ఆర్థికంగా నష్టపోయారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ఇవీ చదవండి.. 'సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేస్తాం'