PAWAN KALYAN: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉచిత అంబులెన్స్ సర్వీసులను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ ప్రజలతో మాట్లాడుతూ అంబులెన్సుల్ సర్వీసులు అత్యవసర సమయంలో అపర సంజీవనిలంటూ అభిప్రాయపడ్డారు. ప్రాణాపాయ సమయంలో, మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని చెప్పారు.
రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులను మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మూడు అంబులెన్సులలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్టు యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
మూడు అంబులెన్సులు రాజా నగరం నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు ఉచిత సేవలు అందించనున్నాయి. అత్యవసర సేవలు అవసరమైన బాధితులు ఫోన్ చేసిన వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీని కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. వ్యయ ప్రయాసల కోర్చి ఉచితంగా అంబులెన్సు సేవలు అందిస్తోన్న జనసేన నేత బల రామకృష్ణను పవన్ అభినందించారు.
ఇవీ చదవండి: