తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రభుత్వ పాఠశాలలో.. నాడు - నేడు పనులకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ అధికారితో పాటు.. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు సందేహాలు అడుగుతుండగా.. పంచాయతీరాజ్ అధికారి దురుసుగా ప్రవర్తించారని ఉపాధ్యాయులు ఆరోపించారు.
"ఎన్నిసార్లు చెప్పాలి. బయటికి వెళ్లిపోండి" అంటూ అవమానించారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారితోనూ దురుసుగా మాట్లాడారని నిరసన తెలిపారు. ఆ అధికారిని బదిలీ చేసే వరకు తాము నాడు-నేడు సమావేశాలకు హాజరు కాబోమని.. బహిష్కరిస్తున్నామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జ్యోతిబసు తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఝాన్సీకి జరిగిన సంఘటనపై వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: