ముగ్గురు రైతులపై సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పు గోనగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన రైతులు గల్లా గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులను 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా..?: మైసూరా