నిత్యావసరాల ధరలు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో సాధారణ హోటళ్లలోనే జేబుకు చిల్లు తప్పడం లేదు..! అదే కాస్త పెద్ద హోటళ్లలో అయితే.. ధరలు పెరుగుతూపోవడమే తప్ప తగ్గేది లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కాకా హోటల్(ONE RUPEE IDLY)లో మాత్రం పేదలకు అందుబాటు ధరలో కడుపు నింపుతోంది.
ఎవరైనా సరే అటువైపు వెళ్తున్న వారు ఈ హోటల్ దగ్గర ఠక్కున ఆగిపోతారు. పెద్దాపురం మండలం ఆర్.బీ కొత్తూరులో చిన్ని రామకృష్ణ, చిన్ని రత్నం లక్ష్మి దంపతులు హోటల్ నడుపుతున్నారు. 16 ఏళ్లుగా ప్లేటు ఇడ్లీ, బజ్జీ రూపాయి చొప్పున అందిస్తున్నారు. ఈ దంపతులతో పాటు రత్నం లక్ష్మీ తల్లి, అత్తయ్య ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్ నిర్వహిస్తారు.
"నిత్యావసర ధరలు మండుతున్నా... రూపాయికి ఇంకో రూపాయి పెంచలేదు. డబ్బు సంపాదనే కాదు... సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నాం... తెల్లారిందంటే చాలు మా హోటల్‌కు జనం క్యూ కడతారు" -చిన్ని రామకృష్ణ దంపతులు
అన్ని ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ, బజ్జీలు ఇవ్వడమంటే ఎంతో గొప్ప విషయమని అక్కడ టిఫిన్ చేసినవాళ్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: