తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌లో లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు గోనె సంచుల లోడుతో వస్తున్న లారీ... జంక్షన్ వద్ద ఆకస్మాత్తుగా అదుపు తప్పి డివైడర్ ఎక్కింది. ఈ క్రమంంలో లారీపై నుంచి గోనె సంచుల బేళ్లు కింద పడిపోవడం వల్ల ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మార్గమధ్యలో మృతి..
హుటాహుటిన క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోవైపు జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనతో లారీ డ్రైవర్ పరారయ్యాడు.