ETV Bharat / state

అర్హురాలే.. అయినా 6 నెలలుగా పింఛను అందడం లేదు

ఎన్నో ఏళ్లుగా ఆ వృద్ధురాలు ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛనుతోనే జీవితం గడుపుతోంది. అయితే నవశకం సర్వేలో ఆమెకు వయసు సరిపోలేదని.. పింఛను పొందేందుకు అర్హురాలు కాదంటూ పేరు తీసేశారు. దీనిపై అధికారులకు అర్జీ పెట్టుకుంటే రీ సర్వే చేసి అర్హురాలిగా గుర్తించారు. అయినా 6 నెలలుగా పింఛను రావడం లేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేదంటూ వాపోతుందా వృద్ధురాలు.

old age woman pension problems in annavaram east godavari district
వృద్ధురాలి పింఛను కష్టాలు
author img

By

Published : Jul 1, 2020, 7:29 AM IST

Updated : Jul 1, 2020, 5:29 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన పలివెల ముసలమ్మకు చాలా ఏళ్లుగా వృద్ధాప్య పింఛను వస్తోంది. ఆ డబ్బుతోనే ఆమె కాలం వెళ్లదీస్తోంది. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక చేయించిన నవశకం సర్వేలో ఆమె వయసు సరిపోలేదని చెప్పి.. పింఛను పొందేందుకు అర్హురాలు కాదని చెప్పారు. దీనిపై ముసలమ్మ అధికారులకు అర్జీ పెట్టుకోగా రీసర్వే చేసి అర్హురాలిగా తేల్చారు. అయినప్పటికీ 6 నెలలుగా పింఛను అందడంలేదు.

వృద్ధురాలి పింఛను కష్టాలు

దీని గురించి పంచాయతీ, మండల, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఫలితం లేదని వాపోయిందా వృద్ధురాలు. ఈ విషయమై శంకవరం ఎంపీడీవో రాంబాబును ఈటీవీ భారత్ సంప్రదించగా.. పింఛను పొందేందుకు ఆమె అర్హురాలేనని.. అయితే డీఆర్డీఏలో సాంకేతిక సమస్య వలన అనర్హురాలిగా నమోదైందన్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి...

కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

Last Updated : Jul 1, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.