ETV Bharat / state

APSRTC: కాలం చెల్లిన బస్సుల్లో దినదినగండంగా ప్రయాణం - ఏపీ ఆర్టీసీ సర్వీసులు

నడుస్తున్న బస్సు వెనక చక్రాలు మొత్తం ఊడిపోవటం ప్రజల్ని భయభ్రాంతులను చేయడమే కాదు.. రాష్ట్రంలో బస్సుల పరిస్థితిపైనా ఆందోళనలు రేపుతోంది. కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణం దినదినగండంగా మారుతోంది. ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.పైగా తిరిగినవి 2,800 బస్సులు ఉన్నాయి. అందులో పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులే ఎక్కువ.

APSRTC
APSRTC
author img

By

Published : Sep 6, 2021, 7:30 AM IST

శనివారం తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న పల్లెవెలుగు బస్సు వెనుక చక్రాలు యాక్సిల్‌తో సహా విడిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికేం కాలేదు. ఇదొక్క ప్రమాదమే కాదు.. గతేడాది అక్టోబరులోనూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజోలుకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సుకు వెనుక చక్రాలు ఊడిపోయాయి. రోడ్లు దెబ్బతినడం, కాలం చెల్లిన బస్సులే ఈ ఘటనలకు కారణాలని తెలుస్తోంది.

కాలం చెల్లిన బస్సులను తుక్కుగా మార్చకుండా.. ఆర్టీసీ ఇంకా వినియోగిస్తోంది. అవి ఎప్పుడు ప్రమాదానికి గురవుతాయో.., ఎక్కడ నిలిచిపోతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రజలు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్లా రహదారులు అధ్వానంగా మారాయి. వీటిపై ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది.

పదేపదే రిపేర్లు

కాలం చెల్లిన బస్సులను నడపడం వల్ల అవి ప్రయాణాల్లో ఉండగానే తరచూ చెడిపోతున్నాయి. ఆయా బస్సుల్లో ఉన్న లోపాలను డ్రైవర్లు నిత్యం లాగ్‌ షీట్‌లో రాస్తున్నా.. ప్రయోజనం ఉండటం లేదు. ఎన్ని విడిభాగాలు మార్చినా వాటి పనితీరు మూణ్నాళ్ల ముచ్చటే. దూర ప్రాంత సర్వీసులూ ఎక్కువగా రిపేరుకు వస్తున్నాయి. ‘సర్వీసు అయిపోయినా వాడటం, పూర్తిస్థాయిలో వాటి విడిభాగాలు లేకపోవడం వల్ల తరచూ రిపేర్లు చేయాల్సి వస్తోంది’ అని ఓ ఆర్టీసీ మెకానిక్‌ తెలిపారు.

కొత్త బస్సులు ఏవీ?

పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకొంటామని కొంత కాలం కిందట ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. ఇందుకు ఆర్టీసీ రూ.వెయ్యి కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2020, మార్చిలోపు 300 బస్సులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత బీఎస్‌-6 వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉండటం, కొవిడ్‌ కారణంగా కొత్త బస్సుల విషయం వదిలేసి పాత వాటితో నెట్టుకొస్తున్నారు.

మైలేజ్‌ వస్తే ఓకే!

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఎన్ని కి.మీ.లు తిరిగిందని కాకుండా ఎక్కువ మైలేజ్‌ వచ్చే వాటిని నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అవసరమైన వాటికి ఛాసిస్‌ మారుస్తున్నామని పేర్కొంటున్నారు. మైలేజ్‌ తగ్గితే.. వాటిని తుక్కుగా మారుస్తున్నట్లు తెలిపారు.

తుక్కుకు వెళ్లాల్సినవి పల్లెలకు..

ఆర్టీసీలో 10 లక్షల కి.మీ.కుపైగా తిరిగినవి 4,588 బస్సులు ఉన్నాయి. గతంలో 8 లక్షల కి.మీ.పైన తిరిగిన ఆర్టీసీ బస్సులను కాలం చెల్లినవిగా పరిగణించేవారు. ఆ తర్వాత ఈ పరిధిని 12 లక్షల కి.మీ. పెంచారు. ఈ లెక్కన చూసినా వేల బస్సులు ఆ పరిధిని దాటిపోయాయి. ముఖ్యంగా తుక్కుకు వెళ్లాల్సిన వాటిలో పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులే ఎక్కువ ఉన్నాయి. సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర సర్వీసులు 8-10 లక్షల కి.మీ. తిరిగిన తర్వాత బాడీ మార్చి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులుగా నడుపుతుంటారు. వీటిని కూడా 12 లక్షల కి.మీ. తర్వాత తుక్కుగా మార్చాలి. అయినా ఇంకా నడుపుతున్నారు.

* ఆర్టీసీ సొంత బస్సులు: 9,139

* 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగినవి: 2,800 (ఇందులో అత్యధికంగా పల్లెవెలుగు సర్వీసులు 2,400, సిటీ ఆర్డినరీ సర్వీసులు 210 ఉన్నాయి.)

* వీటిలో 15 లక్షల కి.మీ.పైన తిరిగినవి: 197 (అత్యధికంగా పల్లెవెలుగు 170 + సిటీ ఆర్డినరీ సర్వీసులు 20 ఉన్నాయి.)

ఇదీ చదవండి: RAINS : రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు... నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.