తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సందడి అంతంత మాత్రంగానే ఉంది. నగర పాలక సంస్థ మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధించటంతో దుకాణాలన్నీ మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఆదివారం కొంత సందడిగా ఉండే మార్కెట్ నిషేధం అమలు కావటంతో ఖాళీగా దర్శనమిస్తోంది.
ఇదీ చదవండి: 'ఎవరింటికీ వెళ్లొద్దు... ఎవర్నీ ఇంటికి రానివ్వొద్దు'