తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో పలు చోట్ల మంచినీటి కొరత వేధిస్తోంది. ప్రజలకు మంచినీటిని అందించేందుకు అధికారులు.. ట్యాంకర్లు ఏర్పాటు చేసి.. సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఈ మంచి నీటి ట్యాంకర్లను తిప్పుతున్నారు. ట్యాంకర్లు వీధుల్లోకి రాగానే.. ప్రజలంతా గుంపులుగా చేరి మంచినీటిని పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న ఈ సమయంలో... ఈ విధంగా ప్రజలంతా ఒక్కదగ్గరకు గుంపులుగా చేరటం... వైరస్ విస్తరించేందుకు మరింత ఆస్కారం ఇచ్చినట్లవుతోంది.
ఇదీ చదవండి: తనయుడి వెంటే.. తల్లి