కుటుంబం, సమాజం ఉన్నత స్థాయిలో ఉండడానికి మహిళలే సూత్రధారులని.. వారిని ప్రోత్సహిస్తే పురుషులు కూడా సాధించలేని విజయాలు సొంతం చేసుకోగలరని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని... ఈ నెల 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు పుదుచ్చేరి ప్రభుత్వం జాతీయ సమైక్యత వారోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రపాలిత యానంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగినులు, గృహిణులకు... ముగ్గులు, వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించారు. విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: