పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. స్థానిక నన్నయ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 'నాడు-నేడు' కార్యక్రమంలో మొదటి విడత పనులకు ఎంపీ శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలోని 25 నగరపాలక సంస్థ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.4.79 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఇదీ చూడండి: 'మన బడి, నాడు - నేడు టెండర్ల అంచనాకు కమిటీ ఏర్పాటు'