ETV Bharat / state

'అందరూ కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలి' - Mummidivaram latest news

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీకి మార్చి 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న తరుణంలో జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు.

జనసేన నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశం
జనసేన నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశం
author img

By

Published : Feb 24, 2021, 5:47 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నగర పంచాయతీకి ఎన్నికల నేపథ్యంలో.. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముమ్మడివరానికి వచ్చిన ఆయనకు పార్టీ ఇన్​చార్జ్​ బాలకృష్ణ, మహిళా కార్యకర్తలు హారతులతో స్వాగతం పలికారు.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆశించిన రీతిలో పని చేసిందని... మహిళా కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయడంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అధికార పార్టీ వాలంటీర్లను అడ్టుపెట్టుకుని అక్రమ మార్గంలో పంచాయతీలను వశపరుచుకుందన్నారు. కార్పొరేషన్లు అని పెట్టి వాటి నిధులను నవరత్నాలకు మళ్ళించారన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలన్నారు.

ఇవీ చదవండి

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య..మృతదేహంతో విద్యార్థుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.