తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పంచాయతీ కార్యాలయంలో వైకాపా నేతపై ఓ గుత్తేదారుడు కత్తితో దాడి చేశాడు. సోమిరెడ్డి అనే గుత్తేదారుడు గతంలో చేసిన పనుల్లో అవినీతికి పాల్పడ్డాడని... అతని బిల్లులను పంచాయతీ కార్యదర్శి పెండింగ్‌లో పెట్టారు. అయితే వైకాపా అనపర్తి అధ్యక్షుడిగా ఉన్న మురళి కావాలనే తన బిల్లులకు అడ్డుపడుతున్నారని భావించిన సోమిరెడ్డి... పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆయనను దుర్భాషలాడుతూ కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వైకాపా నేత మురళిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సోమిరెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
'వైకాపా నేతపై హత్యాయత్నం..బిల్లులకు అడ్డుపడటమే కారణం' - అనపర్తి మర్డర్ అటెంప్ట్ లేటెస్ట్
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో వైకాపా నేతపై హత్యాయత్నం జరిగింది. తన బిల్లులకు అడ్డుపడుతున్నారంటూ మాజీ గుత్తేదారుడు కత్తితో దాడి చేశాడు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పంచాయతీ కార్యాలయంలో వైకాపా నేతపై ఓ గుత్తేదారుడు కత్తితో దాడి చేశాడు. సోమిరెడ్డి అనే గుత్తేదారుడు గతంలో చేసిన పనుల్లో అవినీతికి పాల్పడ్డాడని... అతని బిల్లులను పంచాయతీ కార్యదర్శి పెండింగ్‌లో పెట్టారు. అయితే వైకాపా అనపర్తి అధ్యక్షుడిగా ఉన్న మురళి కావాలనే తన బిల్లులకు అడ్డుపడుతున్నారని భావించిన సోమిరెడ్డి... పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఆయనను దుర్భాషలాడుతూ కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ వైకాపా నేత మురళిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సోమిరెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి-'మసీదుల్లో ప్రార్థనలకు ఇద్దరు మతపెద్దలకే అనుమతి'