ETV Bharat / state

విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ - ముద్రగడ పద్మనాభం తాజా వార్తలు

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు కాపు సోదరులకు లేఖ రాశారు. తనపై వస్తోన్న లేనిపోని ఆరోపణలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

mudragada padmanabham quit from kapu protest
ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి
author img

By

Published : Jul 13, 2020, 11:03 AM IST

Updated : Jul 13, 2020, 1:11 PM IST

mudragada padmanabham quit from kapu protest
ముద్రగడ పద్మనాభం లేఖ

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాపు సోదరుల పేరిట బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తనపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలనుకోలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని.. అందుకు ఏనాడూ చింతించలేదని చెప్పారు. అయినా కూడా కొందరు స్వార్థపరులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి..

వరవరరావు విడుదలకు సహకరించండి: సీపీఐ రామకృష్ణ

Last Updated : Jul 13, 2020, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.