సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటుపై.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అవగాహన సదస్సు జరిగింది. ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ విశాఖపట్నం, డీఐసీ కాకినాడ, కోయర్ బోర్డ్ రాజమండ్రి, విశ్వాస్ కాయర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ కే.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి.. పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి అధికారులు సూచనలు చేశారు.
కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమల సముదాయాల్లో (క్లస్టర్లలో) మౌలిక సదుపాయాలు, యంత్రాలు ఏర్పాటుకు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. పులువురి సందేహాలను నివృత్తి చేశారు. పరిశ్రమల అభివృద్ధికి తమవంతు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సదస్సులో ఎంఎస్ఎంఈ డీఐ జేడీ గద్దె రవి, ఏడీ జీవీఆర్ నాయుడుతో పాటు డీఐసీ డీడీ దొరబాబు, ఐపీవో సందీప్ పాల్గొన్నారు. భట్నవిల్లి, అమలాపురం, బి. దొడ్డవరం, పాసర్లపూడి లంక, బండారులంక, అంబాజీపేట తదితర ప్రాంతాల నుంచి సుమారు 50 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: