వైకాపా ప్రభుత్వంపై మాజీఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్యని దుయ్యబట్టారు. ధర పెంచితే తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అని అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్‌పై జగన్ ఎందుకు అభద్రతభావంతో ఉన్నారో చెప్పాలని కోరారు.
ప్రెస్‌మీట్ పెట్టి నిమ్మగడ్డ రమేశ్ గురించి మాట్లాడడం ఘోరమైన చర్య అని... పాలకులకు కనిపించాల్సింది ప్రజలు... ప్రత్యర్థులు కాదని ఉండవల్లి హితవు పలికారు. అధికారంలోకి వచ్చింది పగతీర్చుకోవడం కోసం కాదన్నారు. రూ.80,500 కోట్లు ప్రజలకు పంచుతామంటారు. ఎక్కణ్నుంచి తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. ఏంచేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదని... నిమ్మగడ్డ రమేశ్, ఎ.బీ.వెంకటేశ్వరరావు అని హెచ్చరించారు.
ఇవీ చదవండి: పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు 40 మార్కులా..?: పట్టాభి