తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని పరిశీలించారు. గోదావరిలో వరద తీరును అధికారులతో సమీక్షించారు. గోదావరిలోకి వస్తున్న వరదనీరు, వదులు తున్న నీటి వివరాలను బ్యారేజీ వద్ద గోదావరి నీటి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వరద ఉద్ధృతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని.... వరద బాధితులకు పునరావాస ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్కడైనా గండ్లు పడితే అధికారులు పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నారని ఎంపీ భరత్‌చెప్పారు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలతో వరద పరిస్థితిపై మాట్లాడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి. ఉగ్ర గోదారి... భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం