తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్‌నగర్‌లో కొవిడ్-19 శాంపిల్ కలెక్షన్ కేంద్రాన్ని ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు. ఇటువంటి కేంద్రాల వల్ల కోవిడ్ పరీక్షలు చేయంచుకోవడం సులభం అవుతుందని ఎంపీ అన్నారు. కొవిడ్ మూడో స్టేజ్‌లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని..., మనలో మార్పు రావాలని అన్నారు.
స్వల్ప లక్షణాలు ఉన్నవారు, ఇతర ప్రభావిత రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇక్కడ పరీక్షలు చేయించుకోచ్చని కమిషనర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కేవలం 5 నిమిషాల్లో శాంపిల్ తీసుకునే ప్రక్రియ పూర్తవుతుందని... తక్కువ లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తామని తెలిపారు. వాలంటరీ టెస్టింగ్ కోసమే అర్భన్ హెల్త్ సెంటర్లలో కొవిడ్ టెస్టింగ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు