తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మార్చి 1 నుంచి.. మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. యువత - హరిత పేరిట చేపట్టే మొక్కల పెంపకం బాధ్యతల్ని విద్యార్థులకు అప్పగిస్తామని చెప్పారు.
రాజమహేంద్రవరంలో కాలుష్యం పెరిగిపోతున్నందున... అభివృద్ధి చేసిన రహదారుల వద్ద ఒక్కో మొక్క నాటుతామన్నారు. ఒక్కో రోడ్డును ఒక్కో కళాశాలకు అప్పగించి.... మొక్కల పెంపకంపై అవగాహన కోసం 2కే, 5కే రన్ నిర్వహిస్తామని వివరించారు.
ఇదీ చదవండి:
నీటిని శుద్ధి చేస్తున్నా.. ఆ గ్రామ ప్రజలకు మంచి నీరు అందని ద్రాక్షే