తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెనలో ట్రాక్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. రైలు వంతెనపై ప్రయాణించి పున:నిర్మాణ పనులను పరిశీలించారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, 36 గంటల్లో రైల్వేశాఖ వీటిని పూర్తి చేశారన్నారు. 1977 తర్వాత గోదావరి నదిపై రైలు ట్రాక్ పూర్తిస్థాయి ఆధునికీకరణ పనులు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.
ఇదీ చదవండి: యానంలోని మద్యం షాపుల్లో ప్రత్యేక అధికారుల తనిఖీలు