తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంను అంతర్జాతీయ పర్యాటక, వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్ రామ్ ప్రకటించారు. ఎన్ఆర్సీడీ పథకంలో భాగంగా.. 416 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు స్వచ్ఛ గోదావరి జలాలను తాగునీటి నిమిత్తం అందిస్తామని తెలిపారు.
నగరంలో రహదారుల విస్తరణ, క్రీడా ప్రాంగణం ఏర్పాటు, మోరంపూడి జంక్షన్ పై వంతెన, హావ్ లాక్ వంతెన, పిచ్చుక లంక ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ఎంపీ పేర్కొన్నారు. బాహ్య వలయ రహదారి నిర్మాణానికీ ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశామని మీడియాకు వివరించారు.
ఇదీ చదవండి: