తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని వెదిరేశ్వరం రోడ్డులో జరిగిన కోడి పందాల్లో సినీ దర్శకుడు వి.వి.వినాయక్ సందడి చేశాడు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.. కొత్తపేట నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కోడి పుంజులకు కత్తులు లేకుంగా పోటీలు నిర్వహించారు. ఆలమూరు మండలం చెముడులంకలో ఎ.ఎం.సీ ఛైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి, శ్రీనివాస్‌లు సమకూర్చిన వస్తాలను ఎమ్మెల్యే, వినాయక్‌లు పాల్గొని పేదలకు అందించారు.
ఇదీ చదవండీ.. జీవన సరళి మారుతోంది.. నాటి సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది!