తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాకు చెందిన నాగూర్ షాబ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై చీడిగుమ్మల నుంచి ప్రత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. షాబ్ భార్య, కుమార్తె అక్కడి కక్కడే చనిపోగా... షాబ్, అతని కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: