పచ్చని కోనసీమలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అమలాపురం కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో వరుసగా రెండు రోజుల్లో మొత్తం నలుగురు ప్రాణాలు విడిచారు. కరోనా కారణంగా ఈనెల 20న ఇద్దరు చనిపోగా.. ఈరోజు రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన వ్యక్తి, గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మృతి చెందడం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. కోనసీమ వ్యాప్తంగా ఇంతవరకూ కొవిడ్ బారినపడి 12 మంది చనిపోయారని అమలాపురం డివిజన్ అడిషనల్ డీఎమ్హెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కరరావు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
కోనసీమలో కరోనా మరణ మృదంగం.. రెండు రోజుల్లో నలుగురు మృతి
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వరుసగా రెండు రోజుల్లో నలుగురు కరోనాతో మృతి చెందడం వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలియజేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డివిజన్ అడిషనల్ డీఎమ్హెచ్ఓ డాక్టర్ సీహెచ్ పుష్కరరావు సూచించారు.