ఆరు సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ ఎక్కడా అవినీతి చేయలేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రధాని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. అందువల్లే దేశంలో మరణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు.
అన్ని రాష్ట్రాలు ఆర్ధికంగా కోలుకోవడానికి అనేక ప్యాకేజీలు మోదీ తీసుకొచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో ఇసుక విధానంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదని విమర్శించారు. ఇసుక పాలసీపై రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దుష్టమైన అవగాహన లేదని సోము వీర్రాజు అన్నారు.
ఇదీ చూడండి: 'తెదేపా నాయకుల అరెస్ట్లు అప్రజాస్వామికం'