'పట్టభద్రుల ఎమ్మెల్సీ' ఎన్నికల ఏర్పాట్లు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనిపోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్నారు.రిటర్నింగ్ అధికారి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సహాయ రిటర్నింగ్ అధికారి గోవిందరాజులు, ఆర్డీవో రాజకుమారి పోలింగ్ విధులు నిర్వహించేసిబ్బందికి పలు సూచనలు చేశారు. రెండు జిల్లాల్లో మొత్తం 322 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం2లక్షల 93వేల మంది పట్టభద్రులు... ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.