తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లో కాళ్ల వాపుతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శనివారం అందజేశారు. ఇటీవల కాలంలో 14 మంది కాళ్ల వాపుతో మృతి చెందారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించింది. మండలంలోని పెద సీతనపల్లి, మామిళ్లగూడెం, మదుగురు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆకుల వెంకటరమణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి...