ETV Bharat / state

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కృతజ్ఞతగా మంత్రుల ర్యాలీ - ఏపీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు న్యూస్

బీసీలకు రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్​కే దక్కిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్​లతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకులాగా చూశాయని, వైకాపా ప్రభుత్వం బ్యాక్ బోన్​లా భావిస్తోందని మంత్రులు అన్నారు.

Ministers
Ministers
author img

By

Published : Oct 19, 2020, 7:15 PM IST

రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఎంపీలు, ఎమ్యెల్యేలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్, పూలే, వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాలాభిషేకం చేశారు.

మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. 139 కులాలున్న బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్లు పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి కృషిచేసిన తొలి సీఎం జగన్ అని అన్నారు. బీసీలకు సముచిత స్థానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 2 కోట్ల 70 లక్షల మంది బీసీలకు రూ. 33,500 కోట్లు లబ్ది చేకూర్చిన ఘనత సీఎం జగన్ దేనని అన్నారు. బీసీలను బ్యాక్ బోన్​ కాస్ట్​గా వైకాపా ప్రభుత్వం భావిస్తుందన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని విమర్శించారు.

ఇదీ చదవండి:

'డిసెంబర్​లో... తిరుపతి నైపుణ్యాభివృద్ధి వర్సిటీకి శంకుస్థాపన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.