ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని... మంత్రి తానేటి వనిత ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంపై కావాలనే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలకు మాట్లాడటానికి ఏమి లేకే... ఇసుక, ఆంగ్ల విధానంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!