తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. పట్టణంలో దిశ పోలీసు స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను సందర్శించారు. ఏర్పాట్లు వివరాలను తెలుసుకొని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: