మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడి ఫొటోను శిలాఫలకంపై ముద్రించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జగ్గంపేట మండలం రాజపూడిలో ఓ రహదారి నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై మంత్రి ఫొటో బదులు ఆయన సోదరుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిత్రం ముద్రించడం విస్మయానికి గురిచేసింది. శంకుస్థాపన అయ్యాక కాసేపటికి ఫొటోను గుర్తుపట్టకుండా చెరిపేశారు.
ఇదీ చూడండి. vishaka steel: అగమ్యగోచరంగా ఉక్కు నియామక ప్రక్రియ