దివీస్ ల్యాబ్ సంస్థ కారణంగా కోనసీమలో ఆక్వా పరిశ్రమ దెబ్బతింటోందని తెదేపా నేత యనమల మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. దివీస్ను వ్యతిరేకిస్తామని చెబుతున్న తెదేపా నేతలు గతం మర్చి పోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఆ సంస్థకు కోనసీమప్రాంతంలో భూ కేటాయింపులు జరిపింది తెదేపా ప్రభుత్వమేనని చెప్పారు. అనుమతులు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. తెదేపా హయాంలో మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు నిద్రపోయారో.. నిద్ర నటించారో తెలియటం లేదని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'మా అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే.. నాపై దాడి చేశారు'