సాంకేతికంగా పోలీసు వ్యవస్థను మరింత పటిష్ట పర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని... రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని మూడవ ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 119 మంది కానిస్టేబుళ్లల్లో విద్యావంతులు అధికంగా ఉన్నారని అన్నారు.
పోలీసు వ్యవస్థకు గౌరవం తీసుకొచ్చేలా అందరూ నడుచుకోవాలని సూచించారు. విపత్తుల సమయాల్లో ఏపీఎస్పీ బెటాలియన్ అందించిన సేవలను ప్రసంశించారు. శాంతి భద్రతల అదనపు డీజీపీ రవిశంకర్ మాట్లాడుతూ... పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని.. నిజాయితీతో రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ఏపీఎస్పీ బెటాలియన్ అందించిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి: