కాలి నడకన స్వరాష్ట్రాలకు బయలుదేరిన పోలవరం ప్రాజెక్టు కార్మికులను క్వారైంటైన్ కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా రంపచోడవరం వైపు వస్తున్న వీరిని ఫోక్స్ పేట చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రంపచోడవరం సీఐ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకొని సుమారు 300 మంది అక్కడకు చేరుకున్నట్లు గుర్తించారు.
వారిని రాజమహేంద్రవరంలో క్వారైంటైన్ కేంద్రానికి తరలించేందుకు గోకవరం ఆర్టీసీ డిపోలో 5 బస్సులను ఏర్పాటు చేశారు. వెనక్కి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కు తరలిస్తున్నామని నచ్చచెప్పగా... వాళ్ళు బస్సులు ఎక్కారు. మిగిలిన వారిని వ్యాన్లు, లారీలలో ఎక్కించి తరలించారు.
ఇదీ చూడండి: