ETV Bharat / state

ఆత్మహత్య చేసుకుంటానంటూ తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి ఆందోళన - వ్యక్తి ఆందోళన తాజా వార్తలు

ప్రభుత్వ ఇళ్ల స్థలాల అర్హుల జాబితా నుంచి తన పేరును తొలిగించారని ఆవేదన చెందిన ఓ వ్యక్తి సచివాలయం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. తనకు ఇళ్లు ఇవ్వకుంటే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం అతడు శాంతించి భవనం పై నుంచి దిగివచ్చాడు.

men attempted suicide
ఆత్మహత్య చేసుకుంటానంటూ వ్యక్తి ఆందోళన
author img

By

Published : Jun 30, 2020, 8:14 PM IST

ఇళ్ల స్థలాల జాబితాలోంచి తన పేరు అన్యాయంగా తొలగించారంటూ ఓ వ్యక్తి సచివాలయం బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేశాడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్​కె పాలెం గ్రామానికి చెందిన కర్రి పోతుల శేషు గతంలో తన పేరు మీద ఇంటి లోనూ తీసుకున్నట్లుగా ఉందని, తాను ఎప్పుడూ లోనూ తీసుకోలేదని వాపోయాడు. దీని వల్ల ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల జాబితాలోంచి తన పేరు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇంటి స్థలం ఇప్పించాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని శేషు పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీస్, రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన కారుడికి న్యాయం చేస్తామని హ‍ామీ ఇచ్చారు.

ఇవీ చూడండి...: కాలువలో గల్లంతైన మహిళ.. మృతదేహం లభ్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.