ఈదురుగాలుల ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మెట్టలో మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు నష్టాలు పాలవుతున్నారు. గోకవరంతోపాటు మెట్టప్రాంతంలో అధికంగా మామిడి తోటల సాగు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటంతో... మామిడి కాయలు నేలరాలాయి. చేతికి అందివచ్చిన పంట నాశనం అయిందని అన్నదాత ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు
కళ్లముందే నేలరాలిన మామిడి... ఆందోళనలో అన్నదాత
ఈ ఏడాది అన్నదాతకు అడుగడుగునా చిక్కులే ఎదురవతున్నాయి. లాక్ డౌన్ సమస్య ఓ పక్క వేధిస్తుంటే దానికితోడు ప్రకృతి మామిడి రైతుల పాలిట శాపంగా మారింది. ఈదురుగాలులతో కూడిన వర్షం చేతికొచ్చిన పంటను నాశనం చేసిందని తూర్పుగోదావరి జిల్లా మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
mango farmers facing problem due to heavy rain in east godavari dst