SHIVA STATUE ISSUE : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులోని శ్మశానవాటికలో ఉద్రిక్తత నడుమ శివుని విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ నెల 28న ఓ వర్గం శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తుండగా మరో వర్గం విగ్రహం ఏర్పాటు తమకు అరిష్టమని అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఓ వర్గం శ్మశానం వద్ద బైఠాయించి నిరసన తెలపగా.. మరో వర్గం రెవెన్యూ కార్యాలయం వద్ద శివుని విగ్రహంతో నిరసనకు దిగారు.
"కోటపాడు గ్రామానికి సంబంధించిన హిందూవులు తమ శ్మశానంలో శివుని విగ్రహం పెట్టుకోవడానికి శనివారం ప్రతిష్ఠ చేయాలని నిర్ణయించుకుని ఆ శివుని విగ్రహం కొంటుంటే.. కొంతమంది దానివల్ల తమకు నష్టం, అరిష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇరు వర్గాల వాళ్లు కలిసి రంగంపేట తహశీల్దారు ఆఫీసుకు వెళ్లారు. నిన్న తహశీల్దారు.. శ్మశానంలో శివుని విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. దాంతో ఈరోజు శివుని విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠను అడ్డుకోవాలని చూసిన వారిని అదుపులోకి తీసుకున్నాం" -పోలీసులు
దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులు రెండు వర్గాల పెద్దలను ఒప్పించి ఎట్టకేలకే శివుని విగ్రహం ప్రతిష్టించారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ అడ్డుకునేందుకు ఓ వర్గం ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరో నాలుగు రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: