తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తున్నందున అధికారులు కట్టిడి చర్యలు చేపట్టారు. నేటి నుంచి దుకాణాలకు ఉదయం 11 గంటల వరకే వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని అన్ని దుకాణదారులు కూడా ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి విక్రయాలు చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కేవలం అత్యవసర విభాగం మెడికల్, ఆసుపత్రులు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం