యానాంలో లాక్డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి రోజువారీ పాసులను జారీ చేశారు. లాక్ డౌన్ ప్రభావంతో పెంపుడు జంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యానాంలో ప్రస్తుతం 927 మంది హోమ్ క్వారంటైన్, ఆరుగురు ప్రభుత్వ అతిథి గృహంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సైకిల్ తొక్కుకుంటూ యానాం చేరుకున్న భార్యాభర్తలను బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వైద్యులు పరీక్షించి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ అతిథి గృహంలో క్వారంటైన్ సెంటర్కు తరలించారు. గోదావరి నది పాయల్లో నాటు పడవల ద్వారా యానాం చేరుకుంటున్న వారిని అడ్డుకునేందుకు కోస్టల్ పోలీస్ గస్తీ నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: రోడ్డెక్కితే 4 గంటలు అక్కడ కూర్చోవాల్సిందే!