తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయం ఆరుగంటలకే అన్ని దుకాణాలు తెరిచారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరుచుకుని వ్యాపారం చేసుకోవాలని, అనంతరం మూసి వేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే ఈ నిబంధనలకు అమల్లోకి వచ్చాయి.
ఇదీ చూడండి